బాన్సువాడ, జూలై8, ప్రజాగళం. ఆషాఢ మాసం పురస్కరించుకుని రాష్ట్ర వ్యవసాయ రహదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సతి సమేతంగా బోనమెత్తారు. బాన్సువాడ మండలంలోని పోచారం స్వగ్రామైన పోచారం గ్రామంలో మంగళవారం పోచారం సతీమణి పుష్పతో కలిసి బోనం ఎత్తుకుని గ్రామదేవత శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో బోనంసమర్పించారు.
కార్యక్రమంలో పోచారం సోదరుడు పోచారంశంభురెడ్డి, సతీమణి ప్రేమల, బాన్సువాడ మండల నాయకులు పండగ సంబరాల్లో పాలుపంచుకున్నారు.

