ఆత్మహత్యాయత్నం లో ఇద్దరి పై కేసు నమోదు.

నిజామాబాద్ క్రైమ్ జూలై 11 ( ప్రజా గళం )

 

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు తనకు అన్యాయం చేశారని మనస్తవం చెందిన బాలాజీ అనే పానీ పూరి వ్యాపారి గురువారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. బాలాజీ ఆత్మ ప్రయత్నానికి కొబ్బరి బొండాల వ్యాపారి సాజిద్ అనే వ్యక్తి సహకరించడంతో అతనిపైన కూడా కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు ఇద్దరు వ్యాపారులపై 226 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశామని, వారికి నోటీసులు జారీ చేయడం జరిగిందని రఘుపతి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.