కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే సమగ్ర అభివృద్ధి. రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి

 

జక్రాన్ పల్లి ఆగష్టు3 ( ప్రజా గళం )

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చాకే సముద్ర అభివృద్ధి జరుగుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. జనహిత పాదయాత్ర కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆర్మూర్ మండల కేంద్రంలో పాదయాత్ర చేసిన తర్వాత ఆదివారం రోజున పివిఆర్ గార్డెన్లో కార్యకర్త ల సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాకే మెరుగైన అభివృద్ధి జరుగుతుందని అన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తుందని, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత 200 యూనిట్ల విద్యుత్, సన్న బియ్యం, రైతు భరోసా, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వంటి సంక్షేమ పథకాలు అమనవుతున్నాయని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా తిరుగుతున్న సందర్భంగా ఆర్టీసీకి ప్రభుత్వం ఏడు వేల కోట్లు చెల్లించిందని అన్నారు. ఆర్గుల్ గ్రామం అంటే పెట్టింది పేరని, ఇక్కడి నుంచి అర్గుల్ రాజారం మంత్రిగా వ్యవహరించారని అన్నారు. నాణ్యమైన ఎరువులు,నాణ్యమైన విత్తనాలు, రైతులకు ఇస్తుందని చెప్పారు, రైతులకు 20 లక్షల కోట్లు రూపాయలు రుణమాఫీ చేశారని అన్నారు, ఇందిరమ్మ ఇల్లు పేదవాడి కళ అని, పేదవాడి కలను తీర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. సంక్షేమ పథకాల్లో 90% అమలు ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని, పేదవాడి గోసను, వినిపించుకోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగి అర్హత టిఆర్ఎస్ పార్టీ కి లేదని అన్నారు. స్థానిక సంస్థల్లో ఉమ్మడి జిల్లాలో ప్రతి స్థానం మనమే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంచిప్ప ప్రాజెక్టు పాత డిజైన్ ప్రకారమే చేస్తున్నావని అన్నారు. రైతులకు రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నామని అన్నారు. 3,500 ఇందిరమ్మ ఇండ్లు మన నియోజకవర్గంలో మంజూరు చేసి, ఇండ్లు కొన్ని గోడల వరకు కొన్ని స్లాబ్ వరకు వచ్చాయని అన్నారు, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రెండు విడతలు మూడు విడతలు డబ్బులు కూడా వచ్చాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డును ఇచ్చిందని, అలాగే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రావడం నిరుపేదలకు ఉచితంగా రేషన్ కార్డులు పంపించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఆర్మూర్ జక్రన్ పల్లి రైతులు ఎర్ర జొన్న, పసుపు ఉద్యమాలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై గత ప్రభుత్వం పెట్టిందని అన్నారు, ఎలక్షన్ సమయంలో మనము ఈ కేసులు కొట్టేపిస్తామని మాట ఇచ్చామని గుర్తు చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజవర్గం నుంచి చాలామంది గల్ఫ్ దేశాలకు వెళ్తారని, కొంతమంది మరణించడం వల్ల వారి కుటుంబాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుందని అన్నారు. ప్రవాసి ప్రజావాణిలో ప్రతి మంగళవారం శుక్రవారం వారి కష్టాలను చెప్పుకోవచ్చు అని అన్నారు. గల్ఫ్ లో మరణించిన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కుటుంబానికి ఐదు లక్షల చొప్పున ఇవ్వడం జరిగిందని అన్నారు. గల్ఫ్ లో మరణించిన కుటుంబాల మహిళలతో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కలవడం జరిగింది. అనంతరం గల్ఫ్ బాధితుల కుటుంబాలతో రాష్ట్ర వివరాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏ ఐ సి సి సెక్రటరీ సంపత్ కుమార్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఇంచార్జ్ మంత్రి సీతక్క, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డిలు కలిసి భోజనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు, వివిధ మండలాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.