బాన్సువాడ, ఆగస్టు 9, ప్రజాగళం.
హైదరాబాద్ నగరంలో రాఖీ పౌర్ణమి ఉత్సాహం నిండిన వాతావరణంలో, మాజీ డీసీసీబీ చైర్మన్, బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులుపోచారం భాస్కర్ రెడ్డి తన నివాసంలో పండుగను ఆప్యాయంగా జరుపుకున్నారు.అనురాగాన్నీ, అనుబంధాన్నీ ప్రతిబింబించే ఈ శుభ సందర్భంలో, ఆయన అక్క శ్రీమతి పోచారం అరుణ సోదరుడి చేతికిప్రేమతోరాఖీకట్టి,ఆయురారోగ్యాలు,విజయాలతో నిండిన జీవితంకలగాలనిహృదయపూర్వకంగా ఆకాంక్షించారు. రాఖీ కట్టిన క్షణంలో వారి ముఖాలపై కనబడ్డ ఆనందం, సోదర సోదరీమణుల మధ్య ఉన్న అఖండమైన బంధానికి అద్దం పట్టింది.ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, “అక్కా-తమ్ముడు, అన్నా-చెల్లెలు అనుబంధం కాలానుగుణంగా మరింత బలపడాలన్నారు .ప్రతి సోదరి జీవితంసంతోషంతో,విజయాలతో నిండాలి. రాఖీ పౌర్ణమి ప్రతి ఇంట్లో ప్రేమ, విశ్వాసం, అనురాగం పండించాలనీ ఆకాంక్షించారు.
దేశవ్యాప్తంగాఉన్నసోదరీమణులందరికీరాఖీపౌర్ణమిశుభాకాంక్షలు తెలుపుతూ, ఈ పండుగ ప్రతి కుటుంబంలో స్నేహం, సోదరత్వం అనేవిలువలకునూతనఉత్సాహం నింపాలని కోరుకున్నారు.

