కేటీఆర్ పై బండి సంజయ్ ఆరోపణలు నిరాధారం. మీడియా సమావేశంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

 

నిజామాబాద్ బ్యూరో ఆగస్టు 10 ( ప్రజా గళం )

కేటీఆర్ పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు.

ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ కు సబందం లేకున్నా బండి సంజయ్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.ఫోన్ ట్యాపింగ్ తో మాకు సంబంధం లేని అంశం అని కేటీఆర్ చాలాసార్లు చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఫోన్ టాపింగ్ పూర్తిగా అధికారులకు సంబంధించిందని..అయిన బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు.

ఒక కేంద్ర మంత్రి స్థాయి హోదాలో ఉండి బజారు బాషా మాట్లాడుతున్నాడని ఆరోపించారు.

ఆ పదవికి ఉన్న స్థాయిని,గౌరవాన్ని బండి సంజయ్ తగ్గిస్తున్నడని,

ఇలాగే మాట్లాడితే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ కి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ జెడ్పి చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, బాజిరెడ్డి జగన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.