బాన్సువాడ, ఆగస్టు 14 ప్రజా గళం.
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలోని సంస్కార్ ప్రకృతి ఆశ్రమం ఆవరణలో బుధవారం రోజు ప్రత్యేకమైన చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. సమాజ మార్పు కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ సంఘ సంస్కర్తలు శ్రీ లవణం & శ్రీమతి హేమలతలవణందంపతులవిగ్రహావిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది.
ఈ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైనరాష్ట్రప్రభుత్వవ్యవసాయ సలహాదారులు,బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి లవణందంపతుల విగ్రహాలనుఆవిష్కరించారు.ఈసందర్భంగాఆయనమాట్లాడుతూ ,“లవణం,హేమలత లవణందంపతులు సామాజిక అసమానతలకు,అన్యాయాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడా రన్నారు.జోగిని వ్యవస్థ నిర్మూలనలో వారి పోరాటం దేశానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు.సమాజంలో అణగారిన వర్గాల గౌరవప్రదమైన జీవనానికి వారు కృషి చేశారన్నారు.వారి త్యాగాలు, విలువలు కొత్త తరాలకు శాశ్వత ప్రేరణగా నిలుస్తాయి అని పేర్కొన్నారు. ప్రత్యేక అతిథులుగా హాజరైన రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ శ్ర కాసుల బాలరాజు , మంతెన సత్యనారాయణ లవణం దంపతుల సేవలను స్మరించారు. జోగినివ్యవస్థవంటిమానవత్వానికి వ్యతిరేకమైన ఆచారాలను నిర్మూలించడం ఒక చారిత్రక ఘట్టంమని ఆ కీర్తిలవణందంపతులకే చెందు తుందన్నారు.
లవణం దంపతుల సేవలు – ఒక స్ఫూర్తి..
లవణం దంపతులు తమ జీవితాన్ని సమాజ సంస్కరణకు అంకితం చేశారు. జోగిని వ్యవస్థ నిర్మూలన కోసం గ్రామాలల్లోకివెళ్లిఅవగాహనకల్పించారు. సమానహక్కులు,స్త్రీ–పురుషసమానత్వం, విద్య, మానవతా విలువల కోసం ప్రజల్లో చైతన్యం నింపారు. వారి కృషి ఫలితంగా వేలాది మహిళలు బానిసత్వంనుండివిముక్తిపొందారు.ఈమహోత్సవంలో స్థానిక ప్రజాప్రతినిధులు,వివిధ రాజకీయ పార్టీ నాయకులు,గ్రామస్థులు, విద్యార్థులు, సంస్కార్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, ఆశ్రమ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

