మద్నూర్ ,ఆగస్ట్ 15, ప్రజాగళం.
జుక్కల్ నియోజకవర్గం మద్మూర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న విట్టల్ జిల్లాస్థాయి ఉత్తమ అవార్డు అందుకున్నారు. దొంగతనాల కేసుల చేధనలో ఆయన చూపిన కృషికి గాను ఈ అవార్డు దక్కింది.
స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కామారెడ్డి లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారి కొదండరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర చేతులమీదుగా విరల్ అవార్డు అందుకున్నారు.
ఉత్తమ సేవలు అందిస్తున్న విరల్‌ను అభినందిస్తూ, మరింత కృషి చేసి ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలని అధికారులు సూచించారు.

