ఎటిఎం సెంటర్ ను పరిశీలించిన సీ. పీ సాయి చైతన్య.

నిజామాబాద్ క్రైమ్ ఆగస్టు 19 ( ప్రజాగళం )

నగరంలోని టౌన్ 3 పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో మంగళవారం తెల్లవారు జామున ఎస్ బిఐ బ్యాంక్ ఎటిఎంలో దొంగతనానికి యత్నించిన సంఘటన స్థలాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పరిశీలించారు. నేరం జరిగిన విధానాన్ని పరిశీలించి ఎస్సై హరిబాబు, టౌన్ సిఐ లకు సూచనలు ఇచ్చి వీలైనంతవరకు త్వరగా నేరస్తులను పట్టుకోవాలని ఆదేశించారు. గుర్తు తెలియని నేరస్తులు మంగళవారం త్రీ టౌన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీ లో తెల్లవారు జామున ఎస్ బిఐ బ్యాంక్ ఎటిఎంలో దొంగతనానికి ప్రయత్నం చేయగా అలర్ట్ మ్రోగడంతో అప్రమత్తమైన మూడో టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకోగా, ఏటీఎం దొంగలు ఈకో వ్యాన్లో పారిపోయారు. వారిని పోలీసులు వెంబడించగా పాల్ద గ్రామ శివారులో వ్యాన్ వదిలేసి తప్పించుకుని పారిపోయారు. క్లూస్ టీం, సిసిఎస్ టీం అధికారులకు కేసు పరిశోధనకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠాగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా విచారణ చేపట్టారు. నగర నడిబొడ్డున జరిగిన ఏటీఎం దొంగతనం యత్నం కేసును పోలీసులు సవాల్ గా స్వీకరించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ దొంగతనం యత్నంపై సీరియస్ గా ఉన్నారు. దొంగల ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

Leave A Reply

Your email address will not be published.