న్యాల్కల్ పాఠశాలకు ప్రాథమిక చికిత్స కిట్టు అందజేత. శ్రీకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపిన పాఠశాల సిబ్బంది.

 

నిజామాబాద్ రూరల్ ఆగస్టు 20 ( ప్రజా గళం)

శ్రీకృష్ణ ఫౌండేషన్ సౌజన్యంతో న్యాల్కల్ ప్రాథమిక పాఠశాల కు ప్రాథమిక చికిత్స కిట్టు ను బుధవారం అందజేశారు. శ్రీకృష్ణ ఫౌండేషన్ కు సంబంధించిన ప్రతినిధులు బాలకృష్ణ , సురేష్ , నరోత్తమ్ రెడ్డి న్యాల్కల్ ప్రాథమిక పాఠశాల కు ప్రాథమిక చికిత్స కిట్టు ను అందజేశారు, వారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొట్టూరు దేవదాస్, పాఠశాల ఉపాధ్యాయులు సరితా మేడం, పోసాని మేడం లు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు ప్రాథమిక చికిత్స కిట్టులు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఆట పోటీలలో భాగంగా విద్యార్థులు గాయాల పాలైతే వెంటనే చికిత్స అందించేందుకు ప్రాథమిక చికిత్స కిట్టులు ఎంతగానో దోహదపడతాయన్నారు.

Leave A Reply

Your email address will not be published.