ఏసీబీకి చిక్కిన అవినీతి చేప. 25 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎంవీఐ.

 

ఆర్మూర్ ఆగస్టు 21 ( ప్రజాగళం )

ఆర్మూర్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానందరెడ్డి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం ఉదయం రెడ్ హ్యoడెడ్ గా పట్టుకున్నారు.

ఏజెంట్ వద్ద 25 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కడం ఆర్మూర్ లో కలకలం రేపింది.

బాధితుల ఫిర్యాదు మేరకు ఏ సీబీ డి ఎస్ పి చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. పక్క వ్యూహంలో భాగంగా గురువారం ఆర్మూర్ ఆర్టిఏ కార్యాలయం వద్ద మాటు వేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏజెంట్ వద్ద నుండి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అతని నుండి 25వేల లంచం డబ్బులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఎంవీఐ ని అరెస్టు చేసి హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. దీంతో అతనిని రిమాండ్ కు తరలించారు. ఏసిబికి చెక్కిన ఎంవీఐ కి సంబంధించిన నిర్మల్ జిల్లాలోని అతని నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.