మద్నూర్ ఆగస్టు 21 ప్రజాగళం.
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు రాచూర్ గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు.
మద్నూర్ మండలం రాచూర్ గ్రామ ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు స్పందించి గ్రామా నికి చేరుకున్నా రు. స్థానికుల ఆరోగ్య పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకుని వైద్య అధికారులకు సమాచారం అందించారు. వైద్యుల బృందాన్ని గ్రామానికి పిలిపించి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయించారు. వైద్యులు గ్రామస్తులను పరీక్షించి, అవసరమైన మందులు అందజేస్తున్నారు. కొంతమంది రోగులను వైద్యుల సూచన మేరకు మద్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు హనుమాన్ల స్వామి, రాజు పటేల్, యూత్ అధ్యక్షులు సతీష్ పటేల్ తదితరులున్నారు.

