ప్రజా గళం నిజామాబాద్ రూరల్:
మోపాల్ మండల కేంద్రానికి చెందిన
పెద్దోళ్ల సాయినాథ్ రెడ్డి, సవీన్ రెడ్డి
ఎడ్ల పొలాల అమావాస్య సందర్భంగా ఎడ్లను ముస్తాబు చేసి గ్రామంలో శోభ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా గళం ప్రతినిధితో వారి జ్ఞాపకాలు, ఎడ్లతో ఉన్న అనుబందాన్ని పంచుకున్నారు. ప్రతి సంవత్సరం జాతరకు మొదటి ఎడ్ల బండి మేమే కడతామని, తాతల కాలం నుంచి వ్యవసాయ పనుల్లో ఎడ్లను ఉపయోగిస్తున్నామని, మారుతున్న కాలంలో యంత్రాల సహాయంతో వ్యవసాయం చేస్తున్నప్పటికీ ఎడ్ల మీద ప్రేమతో పెంచుకుంటున్నామని, మా ఇంటి వద్ద ఎప్పుడు రెండు జతల ఎడ్లు ఎప్పుడు ఉంటాయని తెలిపారు. ముస్తాబు చేసిన ఎడ్లకు 6 సంవత్సరాల వయసు ఉంటుందని,
ఎడ్ల తో పాటు లేగ దూడలు కూడా పెంచుకుంటామని, అవి పనులు చేసిన చేయకున్నా వాటిని మా కుటుంబంలో ఒకరిగా పెంచుకుంటమని, గడ్డితో పాటు మంచి ధాన పెడతామని తెలిపారు. ఎడ్లు ఇంటి ముందు ఉంటే, వాటిని చూస్తే ఎలాంటి భాదలు ఉన్న ఇట్టే మరిచి పోతామని గుర్తు చేసుకున్నారు.

