బాన్సువాడ, ఆగస్టు 26, ప్రజాగళం.
శోభాయాత్ర మార్గంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. బాన్సువాడ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర శాంతియుతంగా నిర్వహించేందుకు మంగళవారం సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఎస్పీ విట్టల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, విద్యుత్ శాఖ అధికారులు, గ్రామ పెద్దలతో కలిసి శోభాయాత్ర రూట్ మ్యాప్‌ను ఆయన పరిశీలించారు. కల్కి చెరువు పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులు విద్యుత్ తీగలు, వీధి దీపాలు తదితర అంశాలను సమీక్షించారు. ప్రజలు శాంతియుతంగా నిమజ్జనం ఉత్సవాలనునిర్వహించుకోవాలనిసూచించారు. భద్రతా పరంగా శోభాయాత్రలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శోభాయాత్రలో పాల్గొనేవారు అధికారులతో సహకరించి పండుగను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐ అశోక్, మాసానీ శ్రీనివాస్ రెడ్డి, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

