బాన్సువాడ, సెప్టెంబర్ 1 ప్రజా గళంః ఉమ్మడీ జిల్లాల వరప్రదాయిని అయిన ప్రాజెక్టు ఏళ్ల చరిత్ర కలిగి తెలంగాణ లోనే మొట్టమొదటిది నిజాంసాగర్ ప్రాజెక్టని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
నిజాంసాగర్ జలాశయం నిండుకుండలా మారి గేట్లు ఎత్తివేయడంతో సోమవారం ప్రాజెక్టును సందర్శించి వరదగేట్ల నీటి విడుదలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 75,000వేల క్యూసెక్కుల నీరు పైనుండి వస్తున్నాయని, అంతే క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని, నాలుగు రోజుల క్రితం 2,40,000 క్యూసెక్కుల నీరు రావడంతో దిగువకు అంతే వేగంగా నీరు విడుదల చేసారని, ఇది సహజంగా వచ్చే వరదని, ప్రస్తుత పరిస్థితుల్లో ఏవిధమైన పొరపాట్లు లేకుండా పర్యవేక్షించి తగు చర్యలు తీసుకునేలా ఎప్పటికప్పుడు సూచించడం జరుగుతుందని, పోచారం ప్రాజెక్ట్ ఎనభై వేల క్యూసెక్కుల నీటి కెపాసిటీతో నిజాం కాలంలో గండుసున్నాన్ని ఉపయోగించి 103 సంవత్సరాల క్రితం నిర్మించారని, ఆ ప్రాజెక్ట్
లక్షా ఎనభై వేల క్యూసెక్కుల వరదప్రవాహన్ని తట్టుకోగలిగిందని, రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నిండుకున్నాయని, నిజాంసాగర్ నిండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, రైతులు రెండు పంటలకు ఎప్పుడు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీష్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

