ఆర్మూర్, సెప్టెంబర్ 06 (ప్రజాగళం) ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైందని ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలోని శ్రీ రామ కాలనీవాసులు తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక శ్రీ రామ కాలోనిలో నున్న ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ గురువు దీవనల వల్లనే ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. దేశానికి మంచి పౌరులను అందించేది కేవలం ఉపాధ్యాయుడేనని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయుడిగా ఉండి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని వారు కొనియాడారు. గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో మహేశ్వర, గురుసాక్షాత్ పరబ్రహ్మ గురువేనమః అంటే గురువే పరబ్రహ్మ స్వరూపమని అర్థమని, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని పెద్దలన్నారని వారు పేర్కొన్నారు. అమ్మానాన్నల తర్వాత గురువు స్థానం చాలా గొప్పదన్నారు. దేశంలో పిల్లల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లో ఉందన్నారు. ఉపాధ్యాయుల సేవలను గుర్తుచేసుకోవడానికి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకొంటున్నామని పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన డాక్టర్ సర్వేపల్లి జీవితం ఆరదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు.కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

