నిజామాబాద్ సిటీ సెప్టెంబర్ 7( ప్రజాగళం )
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపాధ్యక్షులు రామర్తి గోపి ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా రామర్తి గోపి మాట్లాడుతూ , రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంలో మహేష్ కుమార్ గౌడ్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని, నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో పార్టీ ముందుకెళుతుందన్నారు. మహేష్ కుమార్ గౌడ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా విజయవంతంగా ఏడాది కాలం పూర్తి చేసుకోవడం ప్రశంసనీయమన్నారు.

