కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్లమెంట్ లో ఎందుకు ప్రస్తావించడం లేదు. బీసీలకు 42 శాతం అమలు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత.

 

నిజామాబాద్ సెప్టెంబర్ 8 (ప్రజా గళం ప్రతినిధి )

బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గాలను మోసం చేస్తుందని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కామారెడ్డి బిసి డిక్లరేషన్ ను అమలు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని ఆమె తేల్చి చెప్పారు. ఈ మేరకు సోమవారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కీలక సమావేశం నిర్వహించారు.బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో 70కి పైగా బీసీ కులాల నాయకులతో కవిత భేటీ అయ్యారు.కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీసీలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాంగ్రెస్ మోసం చేస్తోందని కవిత ఆరోపించారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇంతవరకు తెలంగాణ బీసీల రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు పార్లమెంటులో ప్రస్తావించలేదో ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించాల బీసీ సంఘాలను కలుపుకుని ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేలా ఉద్యమ కార్యాచణ రూపొందించనున్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాద్గించే వరకు వెనక్కి తగ్గేది లేదని కవిత స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.