నిజామాబాద్ సెప్టెంబర్ 14 (ప్రజాగళం ప్రతినిధి )
నందిపేట్ మండల కేంద్రంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి బాధిత కుటుంబాలను ఆదివారం పరామర్శించారు. వినయ్ కుమార్ రెడ్డి స్నేహితుడైన సోర్పేట్ దేవన్న కుమారుడు విజయ్ (కాంబోడియా) దేశంలో ప్రమాదవశాత్తు ఇటీవల మృతి చెందాడు.
అదేవిధంగా మైనారిటీ సోదరులు గని భాయ్ ఇటీవలే అనారోగ్యంతో చనిపోగా అయన కుటుంబీకులను పరామర్శించారు.
మెకానిక్ శ్రీనివాస్ మాతృమూర్తి ఇటీవలె అనారోగ్యం తో మృతి చెందారు. శ్రీనివాస్ ఇంటికి వెళ్లి కుటుంబీకులను ఓదార్చి వారికి మనోధైర్యం కల్పించారు.
అదేవిధంగా మైనార్టీ అధ్యక్షులు యూసూఫ్ మామగారు అనారోగ్యంతో మృతి చెందగా వారిని పరామర్శించారు.గుండ్ల పోషన్న ఇటీవలే అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. మరి నా కుటుంబ సభ్యులను వినయ్ కుమార్ రెడ్డి పరామర్శించారు.నందిపేట్ పట్టణంలోని వారి వారి స్వగృహాలకు స్వయాన వెళ్లి వారిని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలకు మనో ధైర్యాన్ని కల్పించే విధంగా దేవుని ప్రార్థించారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు.పరమర్శించిన వారిలో వినయ్ కుమార్ రెడ్డి తో పాటు నందిపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మంద మహిపాల్ నందిపేట్ పట్టణ,మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

