నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి. సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. నెలవారి సమీక్షలో పోలీస్ కమిషనర్ సాయిచైతన్య.

 

నిజామాబాద్ క్రైం, సెప్టెంబర్ 18 (ప్రజాగళం) :

నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నేరాల నియంత్రణపై పోలీస్ అధికారులు దృష్టి సారించాలని సీపీ సాయిచైతన్య ఆదేశించారు. నెలవారీ సమీక్షలో భాగంగా గురువారం నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులతో సమీక్ష సమావేశం పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ లో సీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ( అండర్ ఇన్వేస్టిగేషన్) కేసులలో గ్రేవ్ , నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి, గ్రేవ్ నాన్ గేవ్ లలో ఇన్వేస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతీకేసులలో క్వాలిటీ ఇన్వేస్టిగేషన్తో పూర్తి పారదర్శకంగా చేయాలన్నారు. కేసు నమోదు నుండి చార్జీషీటు వరకు ప్రతివిషయాన్ని

 

కూలంకుశంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు. ప్రతీ అధికారికి సి.సి.టి.ఎన్.ఎస్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి అన్నారు. ఇన్వేస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంటు తెలిసిఉండాలన్నారు.దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించేవిధంగా తగు చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసు లతో పాటు చాలా కాలంగా ఉన్న పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం వలన కేసుల సంఖ్య, తగ్గించే విధంగా అన్ని స్థాయిల అధికారులు పనిచేయాలని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిం చుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్ధవంతమైన సేవలు అందజేస్తూ సత్వరన్యాయం చేసే లా కృషి చేయాలని అన్నారు. గ్రామ పోలీస్ అధికారులు (వి.పి.ఓ) ప్రతీ రోజు గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మమేకంమౌతూ నేర నియంత్రణకు కృషి చేయాలని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాలలో సి.సి కెమెరాల ప్రాముఖ్యత అవగాహణ కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో బ్లాక్ స్పాట్లుగా గుర్తించి సైన్బోర్డులను ఏర్పాటు చేయించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో రోడ్డు భద్రత నిబం ధనల గురించి అవగాహణ కల్పించాలని అన్నారు.విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించ కుండా చర్యలు తీసుకోవాలని దొంగతనాలు జరగకుండా పాతనేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు.అసాంఘిక కార్యకలాపాలు గంజాయి , ఇతర మాదకద్రవ్యాల అక్రమరవాణ క్రయవిక్రయాల పైన, జూదం , పి.డి.యస్. రైస్ అక్రమ రవాణలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. నేరస్తులు తరుచూ నేరాలకు పాల్పడేవారి పై పీడీ యాక్టు కోసం పంపాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతం వినాయక చవితి , మిలాద్-ఉన్-నభీ పండుగలను శాంతియుతంగా నిర్వహించిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఉత్తమ విధినిర్వాహనలు నిర్వహించిన సిబ్బందికి “ప్రశంసా పత్రములను ” అందజేశారు. రాబోయే దేవినవరాత్రి ఉత్సవాలు , దీపావళి పండుగలను ప్రజలందరూ శాంతియుతంగా నిర్వహించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు.ఈ సమావేశంలో అదనపు డి.సి.పి (అడ్మిన్) బస్వారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఎ.సి.పి లు రాజా వెంకట్ రెడ్డి, జె. వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం , సి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ సతీష్ , సి.ఐలు , ఎస్.ఐ లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.