అత్యంత ప్రమాదకరమైన హెపటైటిస్ పై అప్రమత్తంగా ఉండాలి. ల్యాబ్ ప్రతినిధులతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి రాజశ్రీ సమావేశం

నిజామాబాద్ వైద్య విభాగం సెప్టెంబర్ 22 ( ప్రజాగళం )

 

అత్యంత ప్రమాదకరమైన హెపటైటిస్ పై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యవర్గ శాఖ అధికారిణి రాజశ్రీ సూచించారు.

డి ఎం హెచ్ ఓ డాక్టర్ బి రాజశ్రీ అధ్యక్షతన సోమవారం ల్యాబ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ,అన్ని బ్లడ్ బ్యాంకులు, ల్యాబ్ లు హెపటైటిస్ వ్యాధిగ్రస్తుల వివరాలను నమోదు చేసి లైన్ లిస్టును సబ్మిట్ చేయాలని కోరారు. అదేవిధంగా మీ మీ లాబ్లో బ్లడ్ బ్యాంకుల్లో తయారయ్యే బయో మెడికల్ వ్యర్ధాలను ట్రీట్మెంట్ ప్లాంట్ కు చెందిన వాహనాల ద్వారా పంపాలని సూచించారు.

హెపటైటిస్ అనేది హెచ్ఐవి, ఎయిడ్స్ కంటే అత్యంత ప్రమాదకరమైనదని ఇది ఒకరి నుండి ఒకరికి వ్యాపించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని హెపటైటిస్ లో ప్రధానంగా సిర్రోసిస్ ఆఫ్ లివర్,లివర్ క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన లక్షణాలు కనిపిస్తాయన్నారు. మీ వద్ద జనరేట్ అయ్యే బయో మెడికల్ వ్యర్ధాలను ఎల్లో బ్యాగులో ప్యాక్ చేసి పంపాలని తెలియజేశారు. అన్ని బ్లడ్ బ్యాంకుల్లో ఎవరికైతే బ్లడ్ అవసరమైన వారు నమోదు చేస్తున్న సమయంలో ఎందుకోసం బ్లడ్ తీసుకున్నరో నమోదు చేయాలని వారికి సూచించారు. .

అదేవిధంగా జరపీడితులకు ఎన్ని,గర్భిణీ స్త్రీలకు ఎన్ని యూనిట్లు ఇచ్చారో నమోదు చేయాలన్నారు . గణాంకాలను జనవరి నుండి డిసెంబర్ వరకు లెక్కించాలని ,ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులను తెలియజేయాలని కోరారు. హెపటైటిస్ కు చికిత్స ఉందని పర్యవేక్షించాలని నెలవారి రిపోర్టును సబ్మిట్ చేయాలని కోరారు. ప్రోగ్రాం అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ, వైరల్ హెపటైటిస్ ను 230 సంవత్సరం కల్లా నియంత్రించాలని, ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల మధ్య సమన్వయం ఉండాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ లు డాక్టర్ రమేష్ , డాక్టర్ అంజన, డాక్టర్ సమత , టీహబు వైద్యులు డాక్టర్ దివ్య ,బ్లడ్ బ్యాంక్ వైద్యులు, డిపియo సుధాకర్, డిహెచ్ఈ వెంకటేశ్వర్లు వివిధ బ్లడ్ బ్యాంకులు ల్యాబ్ ల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.