డ్రైనేజీలో పడిపోయిన గోమాతని కాపాడిన ట్రాఫిక్ హోంగార్డ్.

నిజామాబాద్ క్రైమ్ సెప్టెంబర్ 28 ( ప్రజా గళం )

 

 

జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో డ్రైనేజీలో పడిపోయిన గోమాత ను అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ హోంగార్డ్ స్థానికుల సహాయంతో కాపాడారు. శనివారం డ్రైనేజీలో పడి 10 గంటలు కావస్తుందని స్థానికులు ఆదివారం ట్రాఫిక్ హోంగార్డు జీవన్ సింగ్ కు తెల్పడంతో స్థానికంగా ఉన్న ముగ్గురు,నలుగురు వ్యక్తుల సహాయంతో ఆ గోమాత ని తాడుతో డ్రైనేజి బయటకి సురక్షితంగా తీశారు. హోంగార్డ్ జీవన్ సింగ్ డ్రైనేజీలో పడిన గోమాతను కాపాడిన తీరు పట్ల అక్కడే ఉన్న స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ హోంగార్డు జీవన్ సింగ్ కు కృతజ్ఞతలు తెలిపారు. జీవన్ సింగ్ ని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఇన్స్పెక్టర్ ప్రసాద్ లు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.