నిజామాబాద్, అక్టోబర్ 08( ప్రజాగళం ప్రతినిధి)
జిల్లాలో ఆర్ఓబి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి ఏళ్లు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ కు కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించడంలో పూర్తిగా విఫలం చెందిందని బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పటేల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం మాధవ్ నగర్ ఆర్ఓబి బ్రిడ్జి వద్ద బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. అనంతరం మట్టిని తవ్వి గుంటల్లో పేర్చారు. జిల్లా కాంగ్రెస్ లో పెద్దమనిషిగా చెప్పుకునే మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ల సొంత జిల్లా అయినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఆర్ఓబి పనులు త్వరగా చేపట్టకపోవడం వల్ల రోజుకు పదుల సంఖ్యలో గుంతలో పడి గాయాల పాలవుతున్నారని ఆయన అన్నారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుల చేతకానితనం వల్లే జిల్లాకి ముఖద్వారం లాంటి మాధవ నగర్ ఆర్ఓబి పనులు నిలిచిపోవడం సిగ్గుచేటన్నారు. వారికి చేతకాకపోతే రాజీనామా చేయాలని మండిపడ్డారు.బీజేపీ రాస్తారోకో వల్ల భారీగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి రాంపల్లి జ్యోతి, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బీ.వరలక్ష్మి, నిజామాబాద్ నగరపాలక సంస్థ మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్, నిజామాబాద్ నగరపాలక సంస్థ మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్ కర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

