బాన్సువాడ, అక్టోబర్ 9, ప్రజాగళం.
బాన్సువాడ బీజేపీ కార్యాలయం లో గురువారం జరిగిన కార్యక్ర మంలో జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందు తున్నాయి.ధర్మం,దేశ సేవే బీజేపీ లక్ష్యం అని అన్నారు. ప్రపంచం లోనే అత్యధిక ప్రజాదరణ పొంది న నాయకుడిగా నరేంద్ర మోదీ నిలిచారనిఆయనఅభిప్రాయపడ్డారు.రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు ఎన్నికల్లో బీజేపీ అధికస్థానాలుగెలుచుకుంటుందనే ధీమా వ్యక్తం చేశారు.ప్రతి కార్యకర్త కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బాన్సువాడ మండలం హనుమాజీపేట గ్రామానికి చెందిన వడ్ల శేఖర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నీలం చిన్న రాజులు ఆయనకు పార్టీ కండువా కప్పి సభ్యత్వం కల్పించారు.కార్యక్రమంలో బీజేపీ రూరల్ అధ్యక్షుడు మజ్జిగ శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చీదర్ సాయిలు, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొనాల గంగారెడ్డి, హనుమాన్ యాదవ్, హరికృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు, సీనియర్ నాయకులు సాయిబాబా, దత్తు, సాయిరెడ్డి, లక్ష్మణ్, సురేష్, సంజీవ్, విశ్వనాథ్, విట్టల్, రాజిరెడ్డి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

