బీసీ రిజర్వేషన్ అడ్డుకున్నది బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కట్టుబడి ఉంది. హైకోర్టు తీర్పు తర్వాత షబ్బీర్ అలీ వ్యాఖ్యలు.

 

నిజామాబాద్ అక్టోబర్ 9 (ప్రజాగళం ప్రతినిధి )

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకున్నది బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలేనని షబ్బీర్ అలీ ఆరోపించారు. హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,

గవర్నర్ వద్ద పార్లమెంట్ లో అడ్డుకున్నది భారతీయ జనతా పార్టీ అయితే కోర్టులో కేసు వేసి అడ్డుకున్నది బీఆర్ఎస్ అని ఆయన అన్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ కట్టుబడి ఉందన్నారు.

ప్రభుత్వం తరపున మేం బలమైన వాదనాలు వినిపించడం జరిగిందని,, బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇలా మధ్యంతర స్టే విధిస్తుందని అనుకోలేదని ఆయన అన్నారు.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత ఏం చేయాలనేది నిర్ణయిస్తామని షబ్బీర్ అలీ అన్నారు

మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు.

బీసీ 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుందన్నారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కుల సర్వేలు నిర్వహించిందని,కృత నిశ్చయంతో వన్ మెన్ కమిషన్ వేసిందన్నారు.

కేబినెట్ ఆమోదం కూడా తెలిపిందని,శాసన సభలో చట్టం చేసి గవర్నర్ కు పంపించడం జరిగిందన్నారు.

2018 పంచాయతీ రాజ్ చట్ట సవరణ చేశామన్నారు.

తమిళనాడు రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్న విధంగా ఇక్కడ అమలు చేస్తామని స్పష్టం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్లే కేంద్రం నుంచి నిధులు రావడం లేదని, దీని కారణంగానే గ్రామాలు అభివృద్ధి చేయలేకపోతున్నామన్నారు.

కాంగ్రెస్ హయాంలో సామాజిక న్యాయం జరుగుతుందని,బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టు ఉందని, జీవో 9 తో ముందుకు వెళుతుంటే కోర్టులో అడ్డుకుంటున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం తరపున కోర్టులో బలంగా వాదనలు వినిపిస్తుంటే, బీఆర్ ఎస్, బీజేపీలు ఎందుకు ఇంప్లీడ్ కాలేదో ప్రజలకు జవాబు చెప్పాలని అన్నారు.

వీరి నాటకాన్ని ప్రజల ముందు ఉంచుతాం బీజేపి,బీఆర్ఎస్ రెండు ఒకటే అని ప్రజలకు స్పష్టంగా వివరించడం జరుగుతుందన్నారు.

42 శాతంతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.

కోర్టులో ఇంకా గట్టిగా వాదన వినిపించి 42 శాతానికి అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు.

42 శాతం రిజర్వేషన్ కి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ కృత నిశ్చయంతో ఉన్నారన్నారు.

Leave A Reply

Your email address will not be published.