నిజామాబాద్ క్రైమ్, అక్టోబర్ 14( ప్రజాగళం )
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్ లో ఉన్న ప్రెస్టేజ్ హాస్పిటల్ మేనేజర్ పై హాస్పిటల్ లోనే పనిచేసే టెక్నీషియన్ రాకేష్ నాల్గవ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం డయాలసిస్ రోగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న టెక్నీషియన్ రాకేష్ పై ఆస్పత్రి మేనేజర్ మొహిన్ అసభ్యకర పదజాలంతో దూషిస్తూ దాడి చేసి కొట్టినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్న వివాదానికే మాట మాట పెరిగి రెచ్చిపోయిన మొహిన్ విచక్షణ రహితo దాడి చేసి తీవ్రంగా బాధితుడు పోలీసుల ఎదుట వాపోయాడు. దాదాపు పదిమంది సిబ్బంది మంగళవారం సాయంత్రం హాస్పిటల్ మేనేజర్ మొహిన్ పై నాలుగో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ చేపట్టారు.ఇదిలా ఉండగా గత 15 రోజుల క్రితం ఇదే ఆసుపత్రికి సంబంధించిన నెఫ్రాలజీ డాక్టర్ కు 18 లక్షలు రూపాయలు జీతం ఇవ్వడం లేదని

పోలీసులను ఆశ్రయించగా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆస్పత్రి నెఫ్రాలజీ వైద్యుడు వాపోయారు. మరి కొంతమంది సిబ్బంది సైతం వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అడిగిన వారిని బెదిరింపులకు పాల్పడుతున్నారని సిబ్బంది ఆరోపించారు. ఇకనైనా నాల్గవ టౌన్ పోలీసులు ఆస్పత్రి యజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

