లక్ష్యంతో చదివితే ఉన్నత శిఖరాలకు చేరవచ్చు…జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు….బోధన్ లో ప్రభుత్వ బాలి కల,బాలుర,వసతి గృహలను తనిఖీ చేసిన జడ్జి…

 

బోధన్ ప్రతినిధి,అక్టోబర్ 16: (ప్రజా గళం)

నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు బుధవారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల, బాలుర వసతి గృహలను తనిఖీ చేశారు.ఆచన్ పల్లి లో గల జ్యోతిభాపూలె బాలికల పాఠశాల,వసతి గృహాన్ని తనిఖీ చేశారు.వంటశాలకు వెళ్లిన జడ్జి ఆహా ర పదార్థాలను పరిశీలించారు.పరిశుభ్రతను మెరుగు పరచుకోవాలని సూచించారు.ఉపాధ్యాయుల హాజరు పట్టికను గమనించారు.విద్యార్థినులకు ఏర్పాటు చేసిన వసతులను,తరగతి గదులను పరిశీలించి భద్రత వస తులను అధ్యయనం చేశారు.విద్యార్థినులను కలిసి చదువు గొప్పతనాన్ని వివరించారు.లక్ష్యంతో చదివితె ఉన్నత శిఖరాలకు చేరవచ్చని గుర్తు చేశారు.పూలె దంపతుల జీవితమే ఆదర్శంగా విద్య భవిష్యత్ ను తీర్చిదిద్దుకోవాలని అన్నారు. చదువులో విషయ పరిజ్ఞానం గూర్చి ఉపాధ్యాయు లను అడిగి సందేహా లను తీర్చుకోవాలని సూచించారు.అనంతరం బెల్లల్ గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల,వసతి గృహలను పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ ను వివరాలు తెలుసుకున్నారు.విద్యార్థులకు వసతుల కల్పనలో భోజన నాణ్యతలో రాజీ పాడబోమని ప్రిన్సిపాల్ తెలియజేశారు.విద్య బోధనలో ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారని,కంటికి రెప్పలా చూసుకుంటున్నామని ఆయన తెలిపారు.పాఠశాల,వసతి గృహలను కలియ తిరిగిన జడ్జి ఉదయ్ భాస్కర్ రావు విద్యార్థులను వసతుల కల్పన ఎలా ఉందంటూ వాకబు చేశారు. తరగతి గదిలోనే నిద్రిస్తున్నామని,ఇరుకుగా ఉన్న తరగతి గదిలో నిద్రించడం కష్టంగా ఉన్నదని విద్యార్థు లు తెలిపారు.పాఠశాల,వసతి గృహల తీరుతెన్నులపై సమగ్ర నివేదిక రూపొందించు కుని ఉన్నత న్యాయస్థా నంకు నివేదిస్తామన్నారు.జడ్జి వెంట న్యాయసేవ సిబ్బంది శ్రావణ్,మృళా నిని,పారా లీగల్ వాలంటీర్స్ పద్మ సింగ్,రమణ రెడ్డి,న్యాయవాది ఆశ నారాయణ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.