ఎడపల్లి,అక్టోబర్ 17: (ప్రజా గళం)
విద్యుత్ శాఖ ఎడపల్లి సబ్ డివిజనల్ పరిధిలోని పలు సబ్ స్టేషన్ లలో మూడవ శనివారం విద్యుత్ మరమ్మ తు పనులు చేపట్టడం జరుగుతుంది అని విద్యుత్ శాఖ ఎడపల్లి సబ్ డివిజనల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ నాగేష్ కుమార్ తెలిపారు.ఈ నెల 18 వ తేదీన ఎడప ల్లి సబ్ డివిజనల్ పరిధిలోని బోధన్ రూరల్ సబ్ స్టేషన్ 33/11 కెవి.పరిధిలోని చిన్నమావంది గ్రామంలో, ఎడపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని ఎఆర్ పి క్యాంప్,రెంజ ల్ మండల సబ్ స్టేషన్ పరిధిలోని నీలా గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రాలలో మరమ్మత్తు పనులు చేపట్ట డం జరుగుతుంది అని తెలిపారు.విద్యుత్ మరమ్మత్తు ల వలన మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కరెంట్ సరఫరాలో అంతరాయము ఏర్పడుతుంది అని ఎడిఈ నగేష్ కుమార్ తెలిపారు. మరమ్మత్తుల పనుల వలన విద్యుత్ సరఫరా ఉండద ని కావున విద్యుత్ వినియోగదారులు అధికారులకు సహకరించాలని ఎడిఈ కోరారు.

