నిజామాబాద్ రూరల్,అక్టోబర్ 17( ప్రజా గళం)
కార్యకర్తలే జిల్లా అధ్యక్షున్ని ఎన్నుకోవడం కాంగ్రెస్ సoప్రదాయమని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు.నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షున్ని ఎన్నుకునే కార్యకర్తల అభిప్రాయ సేకరణలో భాగంగా శుక్రవారం డిచ్‌పల్లి,ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన “సంఘటన్ శ్రీజన్ అభియాన్” సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ
“ప్రజాస్వామ్య విధానంలో కార్యకర్తల చేతనే జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఎంతో సంతోషకరమని,ఇతర పార్టీల్లోలాగా పై అధికారుల నిర్ణయం కాదు, కార్యకర్తలే తామే నాయకుడిని ఎన్నుకోవడం కాంగ్రెస్ ప్రత్యేకత,” అని అన్నారు.నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాల కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లకు ఎమ్మెల్యే భూపతి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.అగ్రికల్చర్ కళాశాల నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏర్పడేందుకు తాను వర్షాకాల శాసనసభ సమావేశాల్లో చేసిన కృషి ఫలించిందని అన్నారు.42శాతం బీసీ రిజర్వేషన్‌పై కాంగ్రెస్ కట్టుబడి ఉందని. కానీ బీఆర్ఎస్,

బీజేపీ పార్టీలు దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు. బీసీ సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని భూపతిరెడ్డి తెలిపారు. త్వరలో నిజామాబాద్ జిల్లాకు వెటర్నరీ కాలేజ్ కూడా కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరనని భూపతి రెడ్డి వెల్లడించారు.
కాంగ్రెస్ సేవాదారులకే ప్రాధాన్యత.
-కర్ణాటక ఎమ్మెల్యే, ఏఐసీసీ పరిశీలకుడు రిజ్వాన్ అర్షద్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కర్ణాటక ఎమ్మెల్యే, ఏఐసీసీ పరిశీలకుడు రిజ్వాన్ అర్షద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కనీసం ఐదు సంవత్సరాలుగా నిష్కళంకంగా సేవలందించిన, ప్రజలతో కలసి పనిచేసే కార్యకర్తకే జిల్లా అధ్యక్ష పదవి దక్కేలా చర్యలు తీసుకుంటామన్నారు.
గ్రామాల వారీగా, మండలాల వారీగా కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి ఏఐసీసీకి పంపిస్తామని తెలిపారు.సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో ఈ నియామక ప్రక్రియ జరుగుతోందని,బీజేపీ పాలనలో రైతులు, మైనార్టీలు, బలహీన వర్గాలు నష్టపోయారన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి పార్టీ విజయాన్ని సాధించాలి,” అని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పార్లమెంటరీ అబ్జర్వర్ బల్మూరి వెంకట్ నర్సింగ్ రావు, మాజీ మేయర్ పారిజతం రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్, ఏఎంసీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, శేఖర్ గౌడ్, మునిపల్లి సాయి రెడ్డి, నగేష్ రెడ్డి, మార చంద్రమోహన్ రెడ్డి, వేణు యాదవ్ తో పాటు పలు మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

