సీనియర్ జర్నలిస్ట్ ఉమాకాంత్ మృతి బాధాకరం…. మేము సైతం స్వచ్చందా సేవా సంస్థ చైర్మన్ డాక్టర్.గైని నవీన్ కుమార్….

 

బోధన్ ప్రతినిధి,అక్టోబర్ 17: (ప్రజా గళం)

అందరితో కలుపుగోలుగా,ఉంటూ ప్రతి నిత్యం ప్రజా సమస్యలపై వార్తా కథనాలు రాస్తూ ప్రజలచే గుర్తింపు ను సంపాదించుకొని సీనియర్ జర్నలిస్టుగా తన సేవల ను అందించిన ఉమాకాంత్ ఆకస్మాత్తుగా గుండెపోటు తో మరణించడం బాధాకరం అని,వారి మృతి కుటుం బసభ్యులకు,మన అందరికి తీరని లోటు అని మేము సైతం స్వచ్చందా సేవా సంస్థ చైర్మన్ డాక్టర్.గైని నవీన్ కుమార్ అన్నారు.శుక్రవారం బోధన్ మండలం ఎరాజ్ పల్లి గ్రామంలో మేము సైతం స్వచ్చంద సేవ సంస్థ ఆధ్వర్యంలో దివంగత ఉమాకాంత్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా గైని నవీన్ కుమార్ మాట్లాడుతూ..జర్నలి స్ట్ ఉమాకాంత్ గొప్ప భవిష్యత్తు ఉన్న వారు అని, అటువంటి అయన మధ్యలోనే తనువు చాలించడం బాధాకరం అన్నారు.మేము సైతం స్వచ్ఛంద సంస్థ నిర్వహించే కార్యక్రమాలను ఉమాకాంత్ అభినందిం చేవారు అని,అలాగే మరెన్నో సేవా కార్యక్రమాలని నిర్వహించాలని కూడా వారు ఆకాంక్షించేవారని పేర్కొన్నారు.ఉమాకాంత్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూ రాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మేముసైతం చైర్మన్ డాక్టర్.నవీన్ కుమార్ గైని,గ్రామ పెద్దలు కుప్పిరాల బాలయ్య,సంస్థ సభ్యులు పులి అనిల్,ప్రశాంత్,గంగాధర్,గంగారాం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.