ఎడపల్లి,అక్టోబర్ 18: (ప్రజా గళం)
లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అద్వర్యంలో ఎడపల్లి మం డలం దుబ్బాతండా గ్రామంలో శనివారం డయాబెటిక్ క్యాంప్,ఉచిత మొబైల్ కంటి స్క్రీనింగ్ క్యాంప్ ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్.అజయ్ సుమారు 70 మందికి కంటి పరీక్షలు చేయగా,అందు లో 10 మందికి మోతె బిందు గుర్తించి వారిని ఉచిత కంటి శస్త్ర చికిత్స నిమిత్తం బోధన్ లయన్ హాస్పిటల్ కి రిఫర్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సాయికుమార్,గ్రామ పెద్దలు రవి నాయక్,లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అధ్యక్షురాలు పుష్పలత,సెక్రటరీ మెర్సీ, కోశాధికారి శంకర్,జిఈటీ కో-ఆర్డినేటర్ సూర్యనారా యణ,గంగారెడ్డి,కాశీనాథ్,ప్రకాష్,మనోజ్,పిఆర్ఓ రాకేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

