ఎడపల్లి మండలంలో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు….టపాకాయలు కాలుస్తూ పండుగ సంతో షాన్ని పంచుకున్నారు…..ఎక్కడ చూసిన టాపకాయల మోత,దీపావళి వేళ వెలుగులు విరాజిమ్మయి….

 

ఎడపల్లి,అక్టోబర్ 21: (ప్రజా గళం)

ఎడపల్లి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో సోమవారం దీపావళి పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి.గృహలతో పాటు దుకాణాలు,హోటళ్లు,పలు వ్యాపార సంస్థలలో,ఆలయాల్లో దీపావళి వేళ లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేసి వేడుకలను ఘనంగా జరు పుకున్నారు.సాయంత్రం నుంచి రాత్రి వరకు టపాసు లు,బాంబులు,తారాజువ్వలు,రాకెట్లు,భూ చక్రాలు, సుచ్చిబుడ్డీలు,తీరొక్క పటాకులు కాల్చి రంగుల దీపావళి వేడుకలను ఆనందోత్సాహాలు,సంతోషాల మధ్య పండుగ వేడుకలు జరుపుకున్నారు.పటాకులు పేలుస్తూ పిల్లలు మొదలుకొని పెద్దల వరకు సందడి చేశారు.మహిళలు సైతం పండుగ వేడుకల్లో పాల్గొని కుటుంబ సభ్యులతో టపాసులు పేలుస్తూ ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సందర్బంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి..బాణా సంచాల దుకాణాల వద్ద పటాకులు కొనుగోలుదారులతో సందడిగా మారింది.

అన్ని వర్గాల ప్రజలు దీపావళి వేడుకలు పాల్గొన్నారు. గ్రామాలలో దీపావళి వేడుకల సందర్బంగా టపాసుల మోత మోగింది..రెండో రోజు మంగళవారం దీపావళి పండుగను సంతోషాల మధ్య బాణసంచాలు కాల్చా రు.టాపకాయల దుకాణాలు కిక్కిరిపోయాయి..ఖర్చు ఎంతైనా తగ్గకుండా ప్రజలు భారీగా టపాసులు కొనుగో లు చేశారు.వీధులన్నీ చిన్నాపెద్ద అని తేడా లేకుండా నిండిపోయాయి.అందరూ తమ ఇళ్ల ముందు భారీగా బాణసంచా పేలుస్తూ దీపావళి వేడుకలు చేసుకున్నా రు.

Leave A Reply

Your email address will not be published.