బోధన్ ప్రతినిధి,అక్టోబర్ 21: (ప్రజా గళం)
బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదా రుల ఫై పంట ధాన్యం ఆరబెట్టవద్దని రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి రైతులకు సూచించారు.రహదారిపై ధాన్యం కారణంగా వాహన ప్రమాదాలు జరిగే అవకా శం ఉందని,గతంలో కొందరు వాహనదారులు ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు.రోడ్లపై ధాన్యం ఆ రబెడితే వాహనాలు వడ్ల కుప్పలోకి దూసుకుపోయి అదుపు తప్పి ప్రమాదం వాటిల్లుతుందని,గాయాలు లేదా ప్రాణాలు కూడా పోతాయని అన్నారు.మనిషి ప్రాణం విలువైనదని,నిర్లక్ష్యం వల్ల కుటుంబాలు వీధిన పడతాయని అన్నారు.రోడ్లపై ఆరబెట్టిన ధాన్యాన్ని తక్షణమే తొలగించాలని రైతులకు రూరల్ ఎస్ఐ మచ్చేందర్ సూచించారు.

