ఆగని మొరం దందా….మాయమవుతున్నా గుట్టలు… ప్రభుత్వ అదయానికి గండి కొడుతున్న మొరం మాఫి యా….బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆరోపణ…

బోధన్ ప్రతినిధి,అక్టోబర్ 24: (ప్రజా గళం)
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్కాపూ ర్,గుండారం,ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులలో జరుగుతున్న అక్రమ మొరం తవ్వకాలు జిల్లాలో చర్చనీయంశంగా మారాయి.రాత్రి పగలు తేడా లేదు,మొరం తరలిస్తూనే ఉన్నారు.ఆగని మొరం దందా వల్ల గుట్టలు మాయమాతున్నాయి.మొరం అక్రమ రవాణా వలన ప్రభుత్వ అదయానికి గండి పడుతోంది.ఉన్నత అధికారులకు తెలిసినా పట్టించు కోకపోవడం అనుమానాలకు దారిస్తోంది.శుక్రవారం ఉదయం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి మొరం తవ్వకాలు చేస్తున్న గుట్ట ప్రాంతాన్ని బిజెపి నాయకులు,కార్యకర్తలతో కలిసి పరిశీలించా రు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో దినేష్ పటేల్ మాట్లాడుతూ..ప్రభుత్వ భూముల్లో జరుగుతున్న ఈ అక్రమ మొరం తవ్వ కాలకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అండతోనే జరుగుతుంది అని తీవ్రంగా ఆరోపించారు.ప్రజల కోసం ఉపయోగించవలసిన ప్రభుత్వ భూములను కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత లాభాల కోసం దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.గుండారం,మల్కాపూర్,జానకంపేట్ గ్రామ శివారుల మధ్య మొరం అక్రమ రవాణా వందల టిప్పర్లతో రోజువారీగా జరుగుతోందని,దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా నిలిచి పోయి,అవినీతి పరాకాష్టకు చేరిందని దినేష్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదు అని విమర్శించారు.కేవలం ఫోటోలు,ప్రకటనలకే పరిమితమైన ఇంచార్జి మంత్రుల పనితీరును దినేష్ పటేల్ ఎద్దేవా చేశారు.ప్రజల కోసం పనిచేయాల్సిన ఎమ్మెల్యే,అధికారులను పాదసేవకు లుగా మార్చుకుంటున్నారు అని ఆరోపించారు.ఒక అధికారి ఎమ్మెల్యే చెప్పితేనే పర్మిషన్ ఇస్తా”అని అంటున్నారని,ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు అని వ్యాఖ్యగా అభివర్ణించారు.ఈ సందర్భంగా MRO ఆడియో కాల్‌ను మీడియా ముందు విడుదల చేసి, వెంటనే ఈ ఘటన పై విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను డిమాండ్ చేశారు.“భూపతి రెడ్డి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అని దినేష్ పటేల్ డిమాండ్ చేశారు చేశారు. లేనిపక్షంలో ప్రజలు రాబో యే రోజుల్లో తగిన శిక్ష విధిస్తారని హెచ్చరించారు. ప్రజల హక్కుల కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ వెనక్కి తగ్గదని,అధికార దుర్వినియోగాన్ని ఎదిరించ డానికి సిద్ధంగా ఉంటుందని,అధికారాన్ని అడ్డుపె ⁷ట్టు కొని పేదలను బెదిరించడం కాంగ్రెస్ నేతల లక్ష్యమైం దని దుయ్యబట్టారు. ప్రజల పక్షాన నిలబడి అక్రమాల కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలోబిజెపి నిజామాబా ద్ రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు కండగట్ల రాంచందర్,బోధన్ అసెంబ్లీ కన్వీనర్ కూరెళ్ల శ్రీధర్, ఎడపల్లి మండల బీజేపీ అధ్యక్షులు కోల ఇంద్రక రణ్,నాయకులు ఉప్పు సురేష్,మల్లెపూల శ్రీనివాస్, ప్రేమ్ కుమార్,సంజీవ్,పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.