ఆర్మూర్,అక్టోబర్ 30 (ప్రజాగళం) మండలంలోని చేపూర్ గ్రామంలో ఆదివాసీ నాయక పోడ్ సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 3 నుండి 5వ తారీఖు వరకు జరగబోయే భీమన్న ఉత్సవాల కరపత్రాలను ఆర్మూర్ మండల అధ్యక్షుడు సురకంటి చిన్నారెడ్డి చేతుల మీదుగా గురువారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా చిన్నారెడ్డి. మీనుగు నాగరాజు లు మాట్లాడుతూ నవంబర్ 3 నుంచి 5 వరకుకు జరగబోయే బీమన్న ఉత్సవాలతోపాటు మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ క్రీస్తు శేషులు మీనుగు పెద్ద రాజన్న జ్ఞాపకార్థం జిల్లా స్థాయిలో కబడ్డీ పోటీలు కూడా నిర్వహిస్తున్నట్లు వారి కుమారుడు ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు నాగరాజు ఈ సందర్భంగా తెలిపారు ఈ అవకాశాన్ని జిల్లావ్యాప్తంగా ఆదివాసి నాయకపోడ్ సంఘం సభ్యులు కబడ్డీ పోటీలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో విడిసి అధ్యక్షుడు సారంగి శ్రీకాంత్ మాజీ సర్పంచులు సత్యనారాయణ కుస్తాపురం గంగారెడ్డి మాజీ ఎంపిటిసి జన్నెపల్లి గంగాధర్. శక్తి కేంద్ర ఇన్చార్జి సతీష్ (బబ్లు) పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ సారాంగి శాంతి న్యాయవాది సింధుకర్ చరణ్ బట్టు నవీన్ తదితరులు పాల్గొన్నారు

