జాన్కంపేట్ లో లయన్స్ క్లబ్ అఫ్ ఎడపల్లి ఆధ్వర్యం లో ఉచిత కంటి వైద్య శిబిరం…..105 మందికి కంటి పరీక్షలు……

 

ఎడపల్లి,నవంబర్ 1: (ప్రజా గళం)

లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అద్వర్యంలో బోధన్ లయ న్స్ కంటి హాస్పిటల్స్ వారి సహకారంతో మండలంలోని జాన్కంపేట గ్రామంలో డయాబెటిక్ క్యాంప్ ఉచిత మొబైల్ కంటి స్క్రీనింగ్ క్యాంప్ ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో డాక్టర్.అజయ్ సుమారు105 మందికి కంటి పరీక్షలు చేశారు.అందులో 20 మందికి మోతె బిందు గుర్తించి వారిని ఉచిత కంటి శస్త్ర చికిత్స నిమి త్తం బోధన్ లయన్స్ కంటి హాస్పిటల్ కి రిఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అధ్యక్షు రాలు పుష్పలత,సెక్రటరీ మెర్సీ,కోశాధికారి శంకర్,జిఈ టి కో-ఆర్డినేటర్ సూర్యనారాయణ,గంగారెడ్డి,కాశీనాథ్, మనోజ్,పిఆర్ఓ రాకేష్ వర్మ,గ్రామ పంచాయతీ సెక్రటరీ సందీప్,సిబ్బంది,వాన్ ఇంచార్జ్ హన్మంథ్ రావు, తధితరులు పాల్గొనారు.

Leave A Reply

Your email address will not be published.