చిలుకు ద్వాదశి పూజా కార్యక్రమం.

బాన్సువాడ, నవంబర్ 2, ప్రజా గళం.

సిద్ధి వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాన్సువాడ టీచర్స్ కాలనీలో ఘనంగా రాధాకృష్ణ కళ్యాణం మరియు, చిలుకు ద్వాదశి పూజ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. జంపాల చంద్రశేఖర్ పంతులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో వందమంది జంటలతో కుంకుమార్చన, హలో కృష్ణుని లగ్నం వేదమంత్రాలతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రుద్రంగి స్వరూప ప్రసాద్, నాగుల గ్రామ శ్యామల శ్రీనివాస్, సిద్ధంశెట్టి సత్యనారాయణ,ఉత్తునూరి పద్మ కాశీనాథ్, మాశెట్టి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.