నరసింహస్వామి చాలా మహిమగల దేవుడు. మహేష్ కుమార్ గౌడ్ ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.

 

నిజామాబాద్ బ్యూరో నవంబర్ 5( ప్రజాగళం )

 

లింబాద్రిగుట్ట లక్ష్మీనరసింహస్వామి చాలా మహిమగల దేవుడని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆలయాన్ని అభివృద్ధి పరచాలని ఆమె కోరారు. ఈ మేరకు ఆమె బుధవారం భీంగల్ మండలంలోని లింబాద్రిగుట్ట ఆలయాన్ని సందర్శించి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ,

తెలంగాణ ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

 

కార్తీక పౌర్ణమి సందర్భంగా భీంగల్ మండలంలోని లింబాద్రి స్వామి ఆలయంలో పెద్ద ఉత్సవం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ ఆలయంలోని లక్ష్మీనరసింహస్వామి

చాలా పవర్ ఫుల్ దేవుడని, కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామి వారి ఆశీస్సుల కోసం ఇక్కడికి వచ్చామన్నారు.

నిజానికి లింబాద్రి ఆలయం కాదు, నింబాద్రి. చాలా మహిమ గల దేవుడు.

వేప చెట్లు ఉన్నాయని నింబాద్రి అంటారు. కాలక్రమేణా లింబాద్రిగా పేరు వచ్చిందన్నారు.

ఈ దేవుడి దయ వల్ల నిజామాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కవిత ఆకాంక్షించారు..

ఈ ప్రాంతానికి సంబంధించి రాష్ట్రంలో కీలకమైన కాంగ్రెస్ నాయకులు ఉన్నారని,

ఈ మండలానికి సంబంధించి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు..

మరో ముగ్గురు కార్పొరేషన్ ఛైర్మన్లు కూడా ఈ ప్రాంతం వారేనని,

ఇక్కడి ఎమ్మెల్యే ఎవరన్నది పక్కన పెడితే.. రూలింగ్ పార్టీదే నడుస్తోందని వెల్లడించారు.

అయినా సరే రైతులు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు..

మక్కలు 80 శాతం కొన్న తర్వాత ఇప్పుడు కాంటా పెడుతున్నారు. ఇది దారుణం, అన్యాయం. తడిసిన వరి కూడా కొంటలేరు. కొంటామని కూడా చెప్పటం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు.

మొన్న నేను యంచ గ్రామానికి వెళ్లిన తర్వాత కలెక్టర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందన్నారు.

అలాగే అన్ని చోట్లకు వెళ్లాలని కోరుతున్నానన్నారు.

ఈ ప్రాంతంలోని కొన్ని చెక్ డ్యామ్ లు డ్యామేజ్ అవటంతో బాల్కొండలో పంట పొలాలు మునిగాయని.

వారికి పంట నష్టం ఇస్తామని ప్రభుత్వం ధైర్యం చెప్పటం లేదన్నారు.

ప్రతిపక్షాలు కూడా కనీసం ప్రభుత్వాన్ని నిలదీస్తలేవు.

ఇక్కడున్న ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని నిలదీయాలి. రైతులకు మేలు చేసే ప్రయత్నం చేయాలన్నారు.

కేసీఆర్ లక్ష్మీ నరసింహా స్వామి భక్తుడు. గతంలో లింబాద్రి స్వామి వారికి రూ. 5 కోట్లు కేటాయించారు.

దాంతో గుడిని అభివృద్ధి చేసుకున్నాం. ఈ ఆలయ ప్రాంతంలో మహిళలకు టాయిలెట్స్, ఛేంజింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.

గుట్ట కింద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ పూర్తి కావటానికి రూ. 20 లక్షలు అవసరం. ప్రభుత్వం వాటిని కేటాయించాలి. పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక దృష్టి పెట్టి ఆలయ అభివృద్ధి కి కృషి చేయాలని కవిత కోరారు.

Leave A Reply

Your email address will not be published.