లింబాద్రి గుట్ట జాతర లో పాల్గొన్న ఎమ్మెల్యే.

నిజామాబాద్ బ్యూరో నవంబర్ 5( ప్రజా గళం )

భీంగల్ మండలంలోని లక్ష్మీ నరసింహ స్వామి కొలువుదీరిన లింబాద్రి గుట్ట జాతరలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణగుప్తా పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవంలో పాల్గొని,స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ..

కార్తీకమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రథోత్సవాన్ని ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు నంబి పార్థసారథి, నంబి విజయసారథి, నంబి వాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ ఘనంగా నిర్వహించారని అన్నారు.

లింబాద్రి గుట్ట తెలంగాణ ఆధ్యాత్మిక స్ఫూర్తికి ప్రతీక. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తున్నాయి. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు చేయడం అభినందనీయం. ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ లింబాద్రిగుట్ట జాతరలో అర్బన్ ఎమ్మెల్యే తో పాటు ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి హాజరై స్వామి వారిని దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది .

ఈ కార్యక్రమంలో భారీగా స్వామి వారి భక్తులు, బీ జే పీ సీనియర్ నాయకులు పెద్దోళ్ల గంగారెడ్డి , బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, బిజెపి నాయకులు ఇల్లందుల ప్రభాకర్, మఠం పవన్, పవన్ ముందడ, సుగంధం హరీష్,రేణికింది హరీష్ నాయకులు కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.