ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్లు. ఆహార భద్రత అధికారుల తనిఖీల్లో వెలుగులోకి.

 

నిజామాబాద్ నవంబర్ 10 ( ప్రజా గళం ప్రతినిధి)

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాలతో ఆహార భద్రతాధికారులు తనిఖీలు చేపట్టారు. జిల్లా ఆహార భద్రతా అధికారులు సునీత, నవితల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రముఖ హోటళ్లతో పాటు రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ,ప్రజల ప్రాణాలకు హానికరమైన పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే వారికి నోటీసులు జారీచేసి, వారు వాడుతున్న పదార్థాలను ఫోరెన్సిక్ కు పంపించారు.

 

సోమవారం జిల్లా ఆహార భద్రతా అధికారిణి టి.సునీత, ఆహార భద్రతా అధికారిణి జి.నవిత నిజామాబాద్ పట్టణంలో ఉన్న ప్రముఖ హోటల్స్ తనిఖీ చేశారు.తనిఖీ ల సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించినట్లు కనుగొన్నారు. కొన్ని రెస్టారెంట్లు సరైన పరిశుభ్రత పాటిoచక పోవడం, నిషేధించబడిన ఉప్పు, నిషేధిత సింథటిక్ ఆహార రంగులను ఉపయోగించడం గుర్తించారు. కొన్ని హానికర రంగులు కలిగిన ఆహార పదార్థాలు వెంటనే పారవేయడం జరిగింది. పచ్చి మాంసం నిల్వ ఉన్న ఫ్రీజర్స్ ఉష్ణోగ్రత సరిగ నిర్వహించడం లేదు. వారికి నోటీసులు జారి చేసి అనుమానం వచ్చిన శాంపిల్స్ సేకరించడం జరిగింది.నమూనాలు రాష్ట్ర ఆహార ప్రయోగశాల కి పంపించి నివేదికలు వచ్చాక వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆహార భద్రతాధికారులు వెల్లడించారు.. ప్రతి రెస్టారెంట్ సరైన పరిశుభ్రతను పాటించాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని. లేనియెడల వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.