బాసర గ్రామ అభివృద్ధి కమిటీ నూతన అధ్యక్షుడుగా నూకం లింగరావు ఏకగ్రీవ ఎన్నిక…. నూతన కమిటీ ఆధ్వర్యంలో అందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం…నూతన కమిటి కార్యవర్గం స్పష్టం…

బాసర,నవంబర్ 12: (ప్రజా గళం)

బాసర ఐదవ గ్రామాభివృద్ధి కమిటీని బాసర పోచమ్మ ఆలయంలో బుధవారం ఎన్నుకున్నారు.నూతనంగా ఏర్పడినటువంటి గ్రామాభివృద్ధి కమిటీని బాసర గ్రామ పెద్దలు అన్ని కులాల సంఘాలు పెద్దలు అభినందించారు.నూతనంగా ఏర్పడినటువంటి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల వివరాలు..బాసర గ్రామ అభివృద్ధి కమిటీ నూతన అధ్యక్షులుగా నూకం లింగారావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఉపాధ్యక్షులుగా ఏ.రమేష్(వడ్డెర),బాల చిన్న మల్కన్న,కోశాధికారిగా ఏ.విజయ్(పద్మశాలి),

చిట్టెపు గురప్ప శంకర్,ప్రధాన కార్యదర్శిగా వడ్ల గణేష్,

సంయుక్త కార్యదర్శిగా దావు రాజు,సాంస్కృతిక కార్య దర్శిగా బి.అశోక్(చాకలి),పిఆర్ వోగా.కుమ్మరిభూమేష్ లను ఎన్నుకోవడం జరిగింది.మిగతా ఎన్నుకోబడిన సభ్యులుగా ఉంటారు.ఈ సందర్బంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు అందరు కలిసి బాసర గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని నూతన కమిటీ కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.