ఎడపల్లి,నవంబర్ 20: (ప్రజా గళం)
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ఎంపిపి ఎస్ పాఠశాలలో గురువారం జిల్లా ఆహార భద్రత అధికారిణి టి.సునీత,ఆహార భద్రత అధికారిణి నవిత లు మధ్యాహ్నం భోజనాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.
తనిఖీ సమయంలో,వంటవారికి సరైన పరిశుభ్ర వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని,ఆహార ముడి పదార్థాల కొనుగోలు బిల్లులను కలిగి ఉండాలనీ మధ్యాహ్నం భోజన ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు.నాసిర కము ముడిపదార్థాలను ఉపయోగిస్తే చట్టప రమైన చర్యలు తప్పవు అని మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ వారిని హెచ్చరించారు.

