నేటి నుండి మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణి….ఐకెపి ఎపిఎమ్ రాజేందర్ వెల్లడి… ఎడపల్లి మండలానికి వచ్చిన 12120 చీరలు…. ఎపిఎం….

ఎడపల్లి,నవంబర్ 22 : (ప్రజా గళం)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణి కోసం శనివారం ఎడపల్లి ఐకెపి కార్యాలయాని కి ఇందిరా మహిళా శక్తి చీరలు వచ్చాయాని ఎపిఎం.రాజేందర్ తెలిపారు.ఎడపల్లి మండలానికి 12120 ఇందిరా మహిళా శక్తి చీరలు వచ్చాయాని ఆయన చెప్పారు.ప్రభుత్వ ముఖ్య సలహాదారు,బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి,జిల్లా కలెక్టర్,డిఆర్డిఓ అధికారుల ఆదేశాల మేరకు మహిళలకు ఎడపల్లి మండలంలోని 17 గ్రామాలకు ఆదివారం నుండి ఇందిరా మహిళా శక్తి చీరలు ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి,గ్రామ పెద్దలు, గ్రామ సంఘం పాలక వర్గం సంబంధించి న సీసీఎస్ ల ద్వారా చీరలు పంపిణి చేయడం జరుగుతుంది అని తెలిపారు.18 సంవత్సరాలు ఫై బడిన మహిళలకు చీరలు పంపిణి చేస్తామాని అన్నారు.మహిళలు ఆధార్ కార్డు,రేషన్ కార్డు ఆధారంగా,అలాగే ఆన్ లైన్ లో కంటి దృవీకరణ ద్వారా పంపిణి చేస్తామని అయన చెప్పా రు.ఇందిరా మహిళా శక్తి,మహిళా స్వయం సహాయక సంఘం,అక్కా,చెల్లెళ్లకు మీ రేవంతన్న కాసుక,మహిళా ఉన్నతి_తెలంగాణ ప్రగతి….

Leave A Reply

Your email address will not be published.