ఎడపల్లి,నవంబర్ 24: (ప్రజా గళం)
“మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మి కంగా తనిఖీ చేశారు.ఐ.కే.పీ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించి అధికారులకు పలు సూచ నలు చేశారు.ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి పారద ర్శకంగా,సజావుగా జరగాలని అన్నారు.లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తెలంగాణ సంప్రదాయాన్ని అనుసరిస్తూ గౌరవ ప్రదమైన రీతిలో ప్రభుత్వం తరపున మహిళల కు చీరను అందించాలని సూచించారు.ఎలాంటి విమ ర్శలు,వివాదాలకు తావు లేకుండా,అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర పంపిణీ జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని సూచించారు.పంపిణీ ప్రక్రియను వేగంగా చేపట్టి నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.కలెక్టర్ వెంట తహసీల్దార్ దత్తాద్రి,ఐకేపీ ఎపిఎమ్.రాజేందర్,సిసి లు గాండ్ల సాయిలు,సునీత,
విఓఎ,సుదర్శన్,గ్రామ కమిటీ సభ్యులు లక్ష్మి,గాయత్రి, సౌభాగ్య,లత,దేవిమాత సిబ్బంది తదితరులు ఉన్నారు.

