బ్రాహ్మణపల్లిలో అంగన్ వాడి సెంటర్ కు తాళం..చిన్నా రులకు,గర్భిణీ,బాలింతలకు అందని పౌష్టికాహారం…. గ్రామస్తులు వెల్లడి…. సెంటర్ కు రెగ్యులర్ టీచర్ ని నియమించి న్యాయం చేయాలి….గ్రామస్తులు అధికా రులకు వినతి….సెంటర్ ను ఓపెన్ చేయించి పౌష్టికా హారం అందిస్తాం…. ఐసిడిఎస్ బోధన్ ప్రాజెక్టు సిడిపివో పద్మజ వివరణ….

ఎడపల్లి,నవంబర్ 26: (ప్రజా గళం)

ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో అంగన్ వాడి కేంద్రానికి తాళం వేసి ఉండటంతో గ్రామంలోని చిన్నారులకు,గర్భిణీలు,బాలింత మహిళలకు పౌష్టికహారం అందక ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు.సుమారు 15 రోజుల నుండి అంగన్ వాడి కేంద్రానికి తాళం వేసి ఉందని వారు తెలిపారు.గ్రామంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.కొద్ది నెలలు సెంటర్ లో ఆయా పనిచేసిందని,ఆ తర్వాత ఆయను ఎఆర్ పి క్యాంప్ కు బదిలీ చేశారని చెప్పారు.దాదాపు గత 12 సంవత్సరాల నుండి గ్రామంలోని అంగన్ వాడి సెంటర్ కు టీచర్ లేదని,గతంలో ఈ సెంటర్ లో పనిచేసిన టీచర్ ఎఆర్పి క్యాంప్ కు బదిలీ చేశారని,అప్పటి నుండి టీచర్ లేరని గ్రామస్తులు తెలిపారు.సెంటర్ మూత పడి ఉండటంతో చిన్నారులకు,గర్భిణీ మహిళ లకు,బాలింతలకు పౌష్టికాహారం అందడం లేదని,దింతో వారు ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపా రు.వెంటనే అంగన్ వాడి కేంద్రం సమస్య ను పరిష్క రించి సెంటర్ కు టీచర్ ను నియమించాలని,అంగన్ వాడి కేంద్రం కంటిన్యూనేషన్ చెయ్యాలని,చిన్నారుల కు,గర్భిణీ,బాలింత మహిళలకు పౌష్టికాహారం అందిం చాలని గ్రామస్తులు అధికారులను కోరారు.ఐసిడిఎస్ బోధన్ ప్రాజెక్ట్ సిడిపివో పద్మజ ను విలేకరులు వివరణ అడుగగా,సెంటర్ పనిచేసే ఆయా ఫై పలు ఆరోపణలు రావడంతో ఎఆర్పి క్యాంప్ కు బదిలీ చేయడం జరిగిం ది అని చెప్పారు.వారం రోజులకు సరిపడా పౌష్టి కాహ ర పదార్థాలు ఇంటికి ఇచ్చామని అన్నారు.అయితే సెంటర్ కు తాళం వేసిన విషయం తెలిసిందని, గురువారం అంగన్ వాడి సెంటర్ ను ఓపెన్ చేయిస్తా మని,పిల్లలకు,గర్భిణీ,బాలింతలకు పౌష్టికాహారం అందిస్తామని,ఇబ్బందులు లేకుండా చూస్తామని సిడిపివో పద్మజ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.