పెద్ద గుండవెల్లి ఎల్లమ్మ ఆశీస్సులు పొందిన చట్టం సీఈఓ సిరిగాధ ప్రసాద్ ఘనమైన దర్శనం, ప్రత్యేక పూజలు

 

(ప్రజా గళం- సిద్దిపేట)

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని అత్యంత పవిత్రమైన పెద్దగుండవెల్లి ఎల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని శుక్రవారం రోజున చట్టం దినపత్రిక సీఈఓ సిరిగాద ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. భక్తి, శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ చైర్మన్ మహేష్, సిరిగాద ప్రసాద్ కుటుంబానికి అమ్మవారి చిత్రపటాన్ని అందించి, శాలువాతో సత్కరించారు. సీఈఓ ప్రసాద్ కుటుంబంపై ఎల్లప్పుడూ ఎల్లమ్మ అమ్మవారి కటాక్ష వీక్షణలు ఉండాలని చైర్మన్ మహేష్ ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.