కుర్నాపల్లి సర్పంచ్ అభ్యర్థి పరిగె సాయిలు స్థానిక పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు.. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తా…. సర్పంచ్ అభ్యర్థి పరిగె సాయిలు….

 

ఎడపల్లి,నవంబర్ 29: (ప్రజా గళం)

ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి పరిగె సాయిలు శనివారం తమ మద్దతుదారులతో కలిసి పెద్దఎత్తున స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలోని నామినేష న్ కేంద్రానికి బయలుదేరి వెళ్లారు.నామినేషన్ కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థి పరిగె సాయిలు ఎన్నికల అధికారుల కు నామినేషన్ దాఖలు చేశారు.అలాగే గ్రామంలోని వార్డు స్థానాలకు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.అనంతరం అభ్యర్థి పరిగె సాయిలు మాట్లాడు తూ..తాను ప్రజా సేవ చేయడానికే సర్పంచ్ కు పోటీ చేస్తున్నానని అన్నారు.గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేపట్టెందుకు కృషి చేస్తానని,ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు చేరేలా కృషి చేస్తానని అన్నారు.ప్రజల మద్దతుతో ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులు రాబట్టి గ్రామాన్ని తీర్చి దిద్దుతానని స్పష్టం చేశారు.మండలంలోనే కుర్నాపల్లి గ్రామాన్ని ఆదర్శంగా మారుస్తానని పరిగె సాయిలు పేర్కొన్నారు.నామినేషన్ వేసే కార్యక్రమంలో అయన మద్దతుదారులు గాంధారి హనుమంత్ రెడ్డి,గాంధారి అనీల్ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి,కోండ్ర సజయ్,విఠల్,కృష్ణ రెడ్డి,తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.