రేపటి నుండి మూడవ విడత నామినేషన్ల స్వీకరణ. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వెల్లడి

 

 

 

నిజామాబాద్ డిసెంబర్ 02 ( ప్రజాగళం ప్రతినిధి )

 

 

గ్రామ పంచాయతీ మూడవ విడత నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే మొదటి, రెండవ విడతలలో బోధన్, నిజామాబాద్ డివిజన్లలోని మండలాలలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల షెడ్యూల్ ను అనుసరిస్తూ సజావుగా పూర్తి చేయడం జరిగిందని అన్నారు.

ఈ నెల (డిసెంబర్) 3 నుండి 5వ తేదీ వరకు మూడవ విడతగా ఆర్మూర్ డివిజన్ లోని ఆలూరు, ఆర్మూర్, బాల్కొండ, భీమ్గల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలోని 165 గ్రామ పంచాయతీలు, 1620 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో నామపత్రాలు దాఖలు చేయవచ్చని, డిసెంబర్ 05 చివరి తేదీ అని కలెక్టర్ సూచించారు. అన్ని కేంద్రాలలో హెల్ప్ డెస్క్ లు అందుబాటులో ఉంచామని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సాఫీగా జరిగేలా అన్ని వర్గాల వారు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి కోరారు.

Leave A Reply

Your email address will not be published.