నక్కలగుట్ట తాండలో పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం -అభినంధించిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

 

 

నిజామాబాద్ రూరల్, డిసెంబర్ 05( ప్రజాగళం)

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్ పల్లి మండలం నక్కల గుట్ట తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ గా లకవత్ దేవిసింగ్ తో సహా పాలకవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా

కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నక్కలగుట్ట తండా గ్రామ పంచాయతీలో సర్పంచ్ , ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషకరమని, ఏకగ్రీవమైన సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నక్కల గుట్ట తండా తో పాటు మూడు తండాలు ఐక్యంగా ఉండి ఏకగ్రీవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లకవత్ దేవి సింగ్,ఉపసర్పంచ్ అంగోత్ సురేందర్,వార్డు సభ్యులు

శ్రీనివాస్,చాంగు భాయి,లలితా బాయి రవి, సావిత్రి,చాంగు బిల్లా లకావత్.మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్ , గ్రామ పెద్దలు చందర్ నాయక్, రమేష్ నాయక్, నారాయణ,ముని రామ్, రవి నాయక్,సుదర్శన్,మోబి సింగ్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.