ఎడపల్లి,డిసెంబర్ 6: (ప్రజా గళం)
ఎడపల్లి గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి కందగట్ల రాంచందర్(అన్నాసేట్)విస్తృత ప్రచారం చేస్తు న్నారు.శనివారం సాయంత్రం పాత గ్రామంలో నిర్వహిం చిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్య దర్శులు దంపల్లి జ్యోతి,రాధాయాదవ్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..బిజెపి బలపరు స్తున్న సర్పంచ్ అభ్యర్థి కందగట్ల రాంచందర్ ను ఫుట్ బాల్ గుర్తు కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించా లని వారు ఓటర్లను కోరారు.గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి రాంచందర్ తో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలిసి ఉంగరం గుర్తు కు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.కందగట్ల రాంచందర్ సేవాతత్వం గల మంచి వ్యక్తి అని,గ్రామ ప్రజల మనసు తెలిసిన వ్యక్తి, గ్రామాన్ని అభివృద్ధి పరుచాలన్న తపన,సంకల్పం కలిగిన వ్యక్తికీ ఓటు వేసి మీకు సేవా చేసుకునే భాగ్యం కల్పించాలని వారు ఓటర్లను కోరారు.ఎందరికో అవకా శం ఇచ్చారని,సర్పంచ్ గా కందగట్ల రాంచందర్ కు ఒక్క సారి అవకాశం ఇవ్వాలని,గ్రామంలో అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అందుబాటులో ఉండి పనిచే స్తారని,కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథ కాలు గ్రామ ప్రజలకు అందేలా కృషి చేస్తారని వారు స్పష్టం చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి కందగట్ల రాంచందర్(అన్నా సేట్),నిజామాబా ద్ 37వ డివిజన్ నాయకులు మురళి,వనిత,గ్రామ స్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

