పల్లెపోరులో విజయం ఎవరిది.! ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ప్రచార కార్యక్రమాల్లో..

(ప్రజాగళం ప్రతినిధి రుద్రంగి అశోక్ గుప్తా.)

మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది.బాన్సువాడ నియోజక వర్గంలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో ఈ నెల 17వ తేదీన పంచాయతీ ఎన్నికలు జరగ నున్నాయి.పార్టీలకతీతంగా జరిగే ఈ ఎన్నికల్లోనూ ప్రధాన రాజకీయ పార్టీలు తాము బలపరిచిన అభ్యర్థులే గెలవా లనే లక్ష్యంతో విస్తృతంగా ప్రచార కార్య క్రమాలు నిర్వహించాయి.

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, బాజి రెడ్డి గోవర్ధన్లు తమకు అనుకూలమైన అభ్యర్థుల విజయానికి రంగంలోకి దిగారు.మొదటి, రెండో విడత ఎన్నికల సరళిలో కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించగా,మూడో విడతలోనూ అదే జోరు కొనసాగించాలని పార్టీ నేతలు కసరత్తు చేశారు.ఈ ప్రాంతంలో ప్రస్తుతం టీఆర్ఎస్ బలంగా లేక పోయినప్పటికీ, ఓటు బ్యాంకును నిలుపుకోవాలనే ఉద్దేశంతో ఆ పార్టీ నేతలు వ్యూహాత్మ కంగా అడుగులు వేశారు.మాజీ ఎమ్మె ల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నేతృత్వంలో పలు పంచాయతీల్లో టీఆర్ఎస్ ప్రచార కార్య క్రమాలు నిర్వహించాయి.ఇదే సమయం లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వర్గాలు స్పష్టంగాకనిపించాయి.ఒకవైపుఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్, పోచారం తనయుడు యువ నాయకుడు పోచారం భాస్కర్ రెడ్డి కలిసి తమకు అనుకూల అభ్యర్థులను గెలిపించేందుకు ప్రచారాలు నిర్వ హించి మొదటి,రెండోవిడతల్లోసఫలీకృతులయ్యారు.మరోవైపు బాన్సువాడ నియో జకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్,మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తాను బలపరిచిన అభ్యర్థుల విజయానికి విశ్వ ప్రయత్నా లు చేస్తూ ప్రచార కార్య క్రమాల్లో ముమ్మ రంగాపాల్గొన్నారు.

కాంగ్రెస్లోనే రెండు గ్రూపులు ఉండడంతో పలు పంచాయ తీల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రవీందర్ రెడ్డి వర్గం తమ సత్తా చాటాల ని ప్రయత్నాలు చేస్తున్నాయి. మొత్తంగా ప్రతి నాయకుడు తమకుఅనుకూలమైన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ఉధృతం చేయడంతో బాన్సువాడ నియోజకవర్గంలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.ఇప్పుడు ప్రజల తీర్పు కోసం అభ్యర్థులు,నేతలు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.